AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెండు కొత్త మెట్రో కారిడార్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఢిల్లీ మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెండు మెట్రో లైన్ల ద్వారా ఢిల్లీలో 20 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుందని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 8400 కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకూ మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌లను నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ కారిడార్‌లలో మొత్తం 8 స్టేషన్‌లుంటాయని వివరించారు.

మే 31 వరకు కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి ఉందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అప్పటి వరకు క్యాబినెట్ సమావేశాలు జరగొచ్చని అన్నారు.రూ.8,400 కోట్ల వ్యయంతో ఢిల్లీ మెట్రో ఫేజ్-IV,లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు రెండు కారిడార్లకు ఆమోదం, లజపత్ నగర్ నుండి సాకేత్ జి-బ్లాక్ వరకు 8.385 కిలోమీటర్ల మేర ఉండనున్న మెట్రో లైన్, సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్‌లను కనెక్ట్ చేయనున్న లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ మెట్రో లైన్, 8 కిలో మీటర్లలో ఎనిమిది స్టేషన్ల నిర్మాణం, ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.377 కిలోమీటర్ల మేర ఉండనున్న మెట్రో లైన్, 10 స్టేషన్లతో 11.349 కిలోమీటర్ల భూగర్భ లైన్లు, 1.028 కిలోమీటర్ల ఎలివేటెడ్ లైన్లు, ఎరుపు, పసుపు, ఎయిర్‌పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్ బ్లూ లైన్‌లతో పరస్పర కనెక్టివిటీ అందించనున్న గ్రీన్ లైన్ మెట్రో..హరియాణాలోని బహదూర్‌ఘర్ ప్రాంతానికి కనెక్టివిటీని అందించనున్న గ్రీన్ లైన్

ANN TOP 10