AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నా : ఆరూరి రమేశ్‌

తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ స్పష్టం చేశారు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని.. తమ పార్టీ నేలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నానని.. తాను అమిత్‌షాను కలవలేదని తెలిపారు. మరోవైపు ఆయన బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఆరూరి రమేశ్‌ చేరుకొని భేటీ అయ్యారు.

మరో వైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నారు. భేటీలో కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మధుసూదనచారి, పసునూరి దయాకర్‌, ఆరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతితో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

ANN TOP 10