తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది.
నలుగురు అభ్యర్థులు వీరే..
మల్కాజ్‌గిరి : శంభీపూర్ రాజు
చేవేళ్ల : కాసాని జ్ఞానేశ్వర్
మెదక్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి
జహీరాబాద్ : గాలి అనిల్ కుమార్