పినపాక నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్‌ను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సోమవారం జరిగిన ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాయం పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యమని, నన్ను నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలకు అన్నివేళలా తోడుంటానన్నారు. కష్ట సుఖాల్లో నేను ఆదుకుంటానన్నారు. ఇందుకు సీఎం ప్రత్యేక చొరవ చూపి నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయం సీఎంకు విన్నవించారు.
