AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన నలుగురు కీలక నేతలు

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు ఆదివారం బీజేపీలోకి చేరారు. సీతారాం నాయక్, జలగం వెంకట్ రావు, సైదిరెడ్డి, గోడం నగేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు.

అలాగే, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస బీజేపీలో చేరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి.

ఎన్నికల వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ వేగం పెంచి, ఇంతకుముందే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.

బీజేపీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధిష్ఠానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. సీతారాం నాయక్ ను మహబూబాబాద్ నుంచి, జలగం వెంకట్రావును ఖమ్మం నుంచి పోటీలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.

ANN TOP 10