AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లంచం తీసుకుంటే తాటతీస్తా.. అధికారులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వార్నింగ్‌

కామారెడ్డిలో అధికారులు అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని, అవినీతి రహిత కామారెడ్డిని చూడాలని కోరుకుంటున్నానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. ట్విట్టర్‌ ద్వారా వీడియో విడుదల చేసిన ఆయన అవినీతి అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారులు డబ్బులు తీసుకుంటే ఎంతకైనా తెగిస్తానని, అధికారులు నిజాయితీగా ఉంటే కాళ్లు మొక్కుతానని, అదే అవినీతికి పాల్పడిన అధికారులను రోడ్డు మీదికి లాగి బట్టలు విప్పి కొడతానని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక ఇప్పటి నుంచి 57 నెలల పాటు యుద్ధం చేస్తానని, ధైర్యం, నిజాయితీ ఉన్న కామారెడ్డిలో ఉండాలని, లేకపోత ట్రాన్స్‌ ఫర్‌ పెట్టుకొని వెళ్లిపోవాలని చెప్పారు. తాను డబ్బు, లిక్కర్‌ పంచకుండా నిజాయితీగా గెలిచి వచ్చానని అధికారులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటానన్నారు. ఇప్పటివరకు అవినీతికి పాల్పడ్డ అధికారులకు.. సరిదిద్దుకోవడానికి 100 రోజుల సమయం ఇచ్చానని అన్నారు. తాను అవినీతి రహిత కామారెడ్డి కోసం పని చేస్తానని, అది కాకుండా ఎవరు అడ్డం పడ్డా వాళ్ల అంతు చూస్తానన్నారు. అన్ని డిపార్ట్‌ మెంట్‌ల వారీగా డేటా తన వద్ద ఉందని, అధికారులు ఇష్టం వచ్చినట్టు డిప్యూటేషన్లు, బదిలీలు పెట్టుకున్నా ఎవరిని విడిచి పెట్టనని అన్నారు.

ANN TOP 10