సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న ఉదయం (సోమవారం) యాదగిరి గుట్టకు చేరుకోనున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 9:30నిమిషాలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు పాల్గొననున్నారు.
లంచ్ తరువాత మధ్యాహ్నం భద్రాద్రిలోని రాములవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత మార్కెట్ యార్డ్ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరు ప్రజా దీవెన సభకు రేవంత్ వెళ్తారు. సభలో ప్రసంగించిన అనంతరం సాయంత్రం బేగంపేటకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అవుతారు.