AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గతంలో రేవంత్ రెడ్డి సహా, ఆయన సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నందుకు ప్రజలను క్షమాపణ కోరాలని చెప్పారు.

అప్పట్లో ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తే దాన్ని దోపిడీ అని కాంగ్రెస్ పార్టీ అందని, మరి ఇప్పుడు ప్రజలను వారు ఎందుకు దోపిడీ చేస్తున్నారో చెప్పాలన్నారు. తాము ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు.

ఉచితంగా ఎల్ఆర్ఎస్‌ను అమలు చేయాలని అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.

కాగా, ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టులో కేసు వేశారని కేటీఆర్ ఇటీవల కూడా మండిపడ్డ విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్ పథకానికి ఎవరూ డబ్బులు కట్టవద్దని భట్టి విక్రమార్క కూడా చెప్పారని గుర్తుచేశారు.

ANN TOP 10