AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే… అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా రాజీనామా అనంతరం, ఇప్పటికే ఓ వెకెన్సీ ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. లోక్ సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ANN TOP 10