AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం

శ్రీశైలం: శ్రీశైలంలో (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మల్లన్న కొండ నిండిపోయింది. దీంతో శివనామ స్మరణతో ఇలకైలాస గిరులు మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే అర్ధనారీశ్వరుడిని దర్శనానికి భక్తులు బారులుతీరారు. దీంతో భక్తజనంతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి కిలోమీటర్‌ మేర భక్తులు వేచిఉన్నారు. ఇక లడ్డూ కౌంటర్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

శివరాత్రి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆదిదంపతులకు నంది వాహనోత్సవం, రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు కీలకఘట్టమైన పాగాలంకరణ ఉంటుంది. ఇందులో భాగంగా ఆలయ విమానగోపురానికి, ముఖమండప నందులకు పాగాలంకరణ చేయనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు అంగరంగవైభవంగా కల్యాణం నిర్వహిస్తారు.

ANN TOP 10