AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీ హృదయాలను గెలిచేందుకే వచ్చాను.. ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో పర్యటించారు ప్రధాని మోదీ. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.వికసిత్ భారత్-వికసిత్ జమ్మూ కశ్మీర్ కార్యక్రమం కింద రూ.64వేల కోట్లతో శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియం వేదికగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎంతో ప్రేమానురాగాలు చూపించే శ్రీనగర్ ప్రజల మధ్య తాను ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రేమను గెలిచేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామో వాటితో జమ్ము కశ్మీర్ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని మోదీ చెప్పారు.అభివృద్ధి చెందిన భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న జమ్ము కశ్మీర్ అంతర్భాగం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.

ఒకానొక సమయంలో జమ్మూ కశ్మీర్ ప్రజలు తాము పొందాల్సిన ఫలాలను పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.ఒకానొక సమయంలో దేశం మొత్తం మీద చట్టం అమలవుతోంటే ఒక్క జమ్మూ కశ్మీర్‌ మాత్రమే నిర్లక్ష్యానికి గురైందన్నారు. దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలవుతోంటే.. జమ్ము కశ్మీర్‌లో మాత్రం ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పారు.అయితే ఇప్పుడు కాలం మారిందని, ప్రభుత్వాలు మారాయని చెప్పిన ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్‌లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. ఈ రోజు పర్యాటక రంగంలో, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు తనకు మంచి అవకాశం దొరికిందన్నారు. జమ్మూ కశ్మీర్ కేవలం ఒక ప్రాంతం కాదని మొత్తం భారతదేశానికే ఒక తలమానికమైన ప్రదేశమని మోదీ గుర్తుచేశారు. ఉజ్వలమైన భారతదేశానికి జమ్ము కశ్మీర్ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని పేర్కొన్నారు.

ANN TOP 10