నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి కోరారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల సమస్యలను కంది శ్రీనివాస రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని కోరారు.
