AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం గారు బీపీ పెంచుకుని ఆగం కావొద్దు!

మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన పెట్టారని అన్నారు. ఇప్పుడు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి 12న మరోసారి కదనభేరి మోగించేందుకు పార్టీ సిద్ధమైందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరు గాడిదో.. ఎవరు గుర్రమో.. ప్రజలకు కూడా తెలియాలని, అందుకే రేవంత్ రెడ్డి అయిదేళ్లు పాలన చేయాలని చెప్పారు.

అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్ గొప్పతనం తెలుస్తుందన్నారు. సచివాలయానికి వచ్చి లంకె బిందెలు దొరుకుతాయని భావించానని అన్నాడని గుర్తు చేశారు. ఈ లంకె బిందెలు ఏంది? జేబులో కత్తెర ఏంది? ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆవేశంతో ఊగిపోవడం ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలో నీ పక్కనే బాంబులు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెలుగు, చీకటి రెండూ చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే రేవంత్ రెడ్డి బీపీ పెంచుకొని ఆగమాగం కావొద్దని, తమ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని కేటీఆర్ చెప్పారు.

ANN TOP 10