AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజీవ్ ర‌హ‌దారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమిపూజ‌

హైద‌రాబాద్ : రాజీవ్ ర‌హ‌దారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉద‌యం భూమి పూజ చేశారు. ఈ సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ స‌మీపంలో సీఎం భూమిపూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రాజీవ్ ర‌హ‌దారిపై 11 కిలోమీట‌ర్ల పొడ‌వుతో 6 లేన్ల‌తో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించ‌నున్నారు. రూ. 2,232 కోట్ల‌తో ఈ ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఈ కారిడార్ పూర్త‌యితే.. హైద‌రాబాద్ నుంచి సిద్దిపేట‌, క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్ర‌యాణం సుల‌భం కానుంది.

ANN TOP 10