AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి గుండెపోటు?

అమ్మన్యూస్‌, హైదరాబాద్‌:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఈ ఉదయం హార్ట్‌ ఎటాక్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనను అతని కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్‌ లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు శరత్‌ రెడ్డి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తిరుపతి రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో మెడికవర్‌ ఆస్పత్రికి సీఎం రేవంత్‌ రెడ్డి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ANN TOP 10