హైదరాబాద్: పాతబస్తీ లో కిడ్నాప్ (Kidnap)కు గురైన 9 నెలల చిన్నారి సేఫ్.. పోలీసులు కేసును ఛేదించారు. జహీరాబాద్‌లో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసిన హైదరాబాద్, మాదన్నపేట పోలీసులు.. చంచల్ గూడ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు ఎంజీబీ బస్ స్టేషన్‌లో జహీరాబాద్ బస్‌లో వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని పాపను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలోని నర్సింగ్ హోమ్ హాస్పిటల్‌లో 9 నెల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఆ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్ ఖాన్.. ఇంట్లో పనులు ముగించుకొని పాపను తీసుకుని పరారీ అయ్యారు. షహనాజ్ ఖాన్ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం చత్తీస్‌గఢ్‌కు చెందినట్లు గుర్తించారు. దీంతో బాధితులు మదన్న పెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.