AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగరంలో.. ఆరుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. 54మంది మల్టీజోన్‌కు..

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మరోసారి భారీ ప్రక్షాళన జరిగింది. ఆరుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయడంతో పాటు 54 మంది ఇన్‌స్పెక్టర్ల సేవలను మల్టీజోన్‌ -2కు సరెండర్‌ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి(Kothakota Srinivasa Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో చేరాలని, మల్టీజోన్‌కు మారిన అధికారులు తమ జోన్లలో రిపోర్ట్‌ చేయాలని స్పష్టం చేశారు. అయితే ఖాళీ అయిన స్థానాలన్నింటిలో భర్తీలకు మాత్రం ఆదేశాలు రాలేదు. దీంతో ట్రాన్స్‌ఫర్‌ అయిన స్థానాల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశమున్నందున 1-2 రోజుల్లో మరిన్ని ట్రాన్స్‌ఫర్లు తప్పవని తెలుస్తోంది. బదిలీ అయిన ఆరుగురు అధికారుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఖలీల్‌పాష, పరశురామ్‌, ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణలు నలుగురు ఎస్‌బీకి, సౌత్‌ఈ్‌స్ట జోన్‌ మహిళా పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అనురాధ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు, రామ్‌గోపాల్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు ఐటీసెల్‌కు బదిలీ అయ్యారు.

ANN TOP 10