AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కాంగ్రెస్ రెడీ!

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు హస్తం పార్టీ రెడీ అయ్యింది. ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్ శ్రేణులను విజయం వైపు సన్నద్ధం చేసేందుకు అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘పాలమూరు ప్రజా దీవెన సభ’ తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుండగా.. సీఎం రేవంత్ రెడ్డిని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి ఆహ్వానించారు.

సీఎంకు ఆహ్వానం అందించిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. మధుసూదన్ రెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదు అల్లా కొత్వాల్ పాల్గొన్నారు. మార్చి 6న మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే కొడంగల్ – నారాయణ పేట ఎత్తిపోతల ప్రకటనతో పాలమూరులో ఇప్పటికే కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వచ్చాయి. దీంతో ప్రజా దీవెన సభలో మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు కురిపిస్తారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

ANN TOP 10