పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు. మృతదేహాలను, కాల్పుల్లో గాయపడిన వారిని లారీల్లో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కార్యాలయం ఈ సంఘటనపై స్పందించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 30వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.
