AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని, సీఎం పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ఛాలెంజ్‌ విసిరారు. ఇద్దరం మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా అంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. గురువారం నగరంలోని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ‘కేటీఆర్‌.. నీవు మగాడివైతే రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల క్రితం ఛాలెంజ్‌ చేసిన విషయం విదితమే.

ANN TOP 10