AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మందుబాబులూ బీ అలెర్ట్.. మరింత జోరుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు

మందుబాబులు జర జాగ్రత్త.. ఇక నుంచి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ ల నిర్వహించే సంఖ్య పెంచబోతోంది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను డయాజియో కంపెనీ అందజేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ లకు డయాజియో కార్పొరేట్ ఎఫైర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ రవి వర్మ, క్లస్టర్ హెడ్ సేల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ అశ్వాంత్ బైసాని, మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ మేనేజర్ కే జై కృష్ణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ప్రోగ్రామ్స్ అసోసియేట్ మేనేజర్ రజత సరోహ తదితరులు బ్రీత్ అనలైజర్ లను అందజేశారు.

సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో విభాగాలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్ లను అందజేసేందుకు ముందుకు వచ్చిన డయా జియో కంపెనీ, ఎన్జీవో సిఎస్ఆర్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సామాజిక బాధ్యత కింద వారు తీసుకున్న చొరవ తో పోలీస్ సిబ్బంది సామర్థ్యం మరింతగా మెరుగవుతుందని, తద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరికరాల ద్వారా కొంతమంది నైనా కాపాడగలిగితే ప్రయోజనం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని దానిని నివారించేందుకు పోలీస్ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఈ రకమైన ఆధునిక పరికరాల వల్ల పోలీస్ సిబ్బంది పనితీరు సామర్థ్యం పెరుగుతుందని తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.

ANN TOP 10