AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు.

అయితే ఈ రోజు కోర్టు సమయం ముగియడంతో కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు. త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే విచారణకు సమయం లేదంటూ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.

ANN TOP 10