టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. అరకు పర్యటనలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. మన గిరిజన సోదరులు పండించే అరకు రుచి ఎలా ఉందో చెప్పు అంటూ అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు.. అరకులో పండించే కాఫీ ప్రత్యేకమైన రుచి కలిగి ఉండి అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్శించింది. దేశ విదేశాలకు కాఫీ ఎగుమతి అవుతుంది. ఈ కాఫీ ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ రుచి చూసేందుకు వస్తారని చెప్పడంలో ఎలాంటి డౌటూ లేదు. ఈ క్రమంలో నారా భువనేశ్వరి అరకు కాఫీ రుచి చూడటం ఆసక్తికరంగా మారింది.