AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. అలాగే 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ జరిగారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో జగిత్యాల అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ)గా పర్సా రాంబాబు, హన్మకొండ అదనపు కలెక్టర్‌గా ఎ. వెంకట్ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సీహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా డి. వేణు గోపాల్, జీహెచ్‌ఎంసీ అదనపు కలెక్టర్ బీహెచ్ సహదేవ్ రావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటిల్‌ బదిలీ అయ్యారు. వీరితో పాటు ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా, కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్ బదిలీ అయ్యారు.

ANN TOP 10