AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశ భవిష్యత్తుకు బీజేపీ శత్రువుగా మారుతుంది: రాహుల్ గాంధీ

బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ భవిష్యత్తుకు మోడీ ప్రభుత్వం శత్రువుగా మారుతుందని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరిలో కానిస్టేబుల్ రిక్యూట్‌మెంట్ పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేసింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ పేపర్ లీక్‌తో అభ్యర్థులు నిస్పృహకు గురవుతున్నారని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చెప్పుకొచ్చారు. ఒకచోట విద్యార్థులు రిక్రూట్‌మెంట్‌పై అతృతలో ఉన్నారని, మరోచోట పేపర్ లీక్‌లో నిస్పృతో ఉన్నారని అన్నారు. ఇంకోచోట విద్యార్థులు అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని, మరో చోట గొంతెత్తిననందుకు లాఠీ దెబ్బలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించడంతో విఫలమైందని, ఆర్‌ఓ-ఏఆర్‌ఓ నుంచి, పోలీసు రిక్రూట్‌మెంట్, రైల్వే ఆర్మీ వరకు యువతపై ఆగ్రహం వెల్లగక్కుతుందని చెప్పారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలను తమ మిత్రులకు అమ్ముకోవడం, యువకులను కాంట్రాక్టు కార్మికులు మార్చడం మోడీ విధానంగా మారిందని ఫైర్ అయ్యారు. వంచనకు పాల్పడటమే మోడీ విధానమని రాహుల్ తప్పుపట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలలకు మోడీ ప్రభుత్వం ఒక గ్రహణంలా మారిందని, ఈ నేరానికి చరిత్ర ఎప్పటికీ మోదీని క్షమించదని రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.

ANN TOP 10