AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటర్ పరీక్షలు షురూ..

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ 4,78,718 మంది విద్యార్థులు, సెకండర్ ఇయర్ విద్యార్థులు 5,02,260 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ -1 పరీక్ష జరుగుతుంది. రేపు (గురువారం) సెకండియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ -2కు పరీక్ష ఉంటుంది. పరీక్షలు రాసే విద్యార్థులకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ANN TOP 10