రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ కేసులో కేసును దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, అవి పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. హోటల్‌లో చాలా సార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పినట్లు వెల్లడించారు. డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో పూర్తిగా నిర్ధారణ కాలేదని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, వివేకానంద్‌కు డైరెక్టర్ క్రిష్‌తో పరిచయం ఎన్నాళ్లుగా ఉందో తెలియదన్నారు.
అబ్బాస్ ఇప్పటి వరకు 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు సెట్మెంట్‌లో తేలిందన్నారు. శ్వేత, సీందీప్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. చరణ్ బెంగళూరు నుంచి వస్తున్నాడని, డైరెక్టర్ క్రిష్ వచ్చాక పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. క్రిష్ హోటల్‌కి వెళ్లిన పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని, హోటల్ యాజమన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నిందితులు డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకు వస్తాన్నారో దానిపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వినీత్ పేర్కొన్నారు. అయితే ఈ డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు బయటపడుతుండడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో నటి లిషి గణేష్ కూడా వచ్చింది. ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన దర్శకుడి క్రిష్ పేరు బయటపడడం హట్ టాపిక్‌గా మారింది.