AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండ్ల గణేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు.. రోజా పులుసు పాప అంటూ..

నిత్యం వార్తల్లో నిలిచే సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్లపై స్పందించిన బండ్ల గణేష్.. రోజాను డైమండ్ రాణి అని, పులుసు పాప అని.. ఐటెం రాణి అంటూ ఘాటు కామెంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చేపల పులుసు వ్యాఖ్యలపై ఓ టీవీ ఇంటర్వూలో స్పందించిన రోజా.. ఆయన యాక్సిడెంటల్ సీఎం అని, ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. రోజా చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. రోజా డైమండ్ రాణి అని.. ఆమెకు ఈసారి సీటు వస్తుందో రాదో డౌట్ అంటూ విమర్శలు చేశారు బండ్ల గణేష్.

అయితే.. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని.. సీఎం జగన్ మోహన్ రెడ్డినే యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని బండ్ల గణేష్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు, ఫైటర్ అని చెప్పుకొచ్చారు. భారతదేశంలో రేవంత్ రెడ్డిలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారన్న బండ్ల గణేష్.. పోరాడి, కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. నాన్న చనిపోతేనో.. తండ్రి వారసత్వంతోనే ముఖ్యమంత్రి అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారని పేర్కొన్నారు. లేకపోతే పులుసు వండిపెడితేనో పదవి వస్తే యాక్సిడెంటల్ అంటారంటూ ఎద్దేవా చేశారు.

పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అయ్యిందంటూ బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రేపో మాపో మాజీ అవుతావని.. ఆ మాజీ ఈ మాజీ కలిపి హైదరాబాద్ వచ్చి పగలు పూట జబర్ధస్త్ ప్రోగ్రాంలు చేసుకోవాలని.. రాత్రి పూటేమో తాజా మాజీలంతా కలిసి కేజీల లెక్కన చేపలు తెచ్చుకుని పులుసు వండి పెట్టుకోవాలంటూ హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజాకు లేదన్నారు. రోజా ఐటం రాణి అని.. ఐటెంలాగానే ఉండాలంటూ బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10