AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హుస్నాబాద్‌లో హైటెన్షన్‌.. ఉద్రిక్తత మధ్య బండి యాత్ర

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో హైటెన్షన్‌ చోటుచేసుకుంది. ఉద్రిక్తత మధ్య బీజేపీ ఎంపీ బండి ప్రజాహిత కొనసాగుతోంది. బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ నాయకులను కించపరిచే విధంగా మాట్లారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు సైతం వారిని ప్రతిఘటించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేసి.. కాంగ్రెస్‌ కార్యకర్తలను అక్కడి నుండి తరలించారు. అనంతరం బండి సంజయ్‌ తిరిగి యాత్ర ప్రారంభించారు. భారీ పోలీసు భద్రత నడుమ యాత్ర కొనసాగుతుంది.

కాంగ్రెస్‌ శ్రేణుల తీరుపై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. తాను ఎవరినీ కించపర్చేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే కేసు పెట్టిన లీగల్‌గా చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబడ్డార్‌.. అంటూ సంజయ్‌ హెచ్చరించారు. ప్రజాహిత యాత్ర ఫ్లెక్సీలను కాంగ్రెస్‌ నాయకులు చింపేస్తున్నారంటూ మండిపడ్డారు. మా మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. మేం తల్చుకుంటే కాంగ్రెసోళ్లు బయట అడుగు కూడా పెట్టలేరని వార్నింగ్‌ ఇచ్చారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులను బండి సంజయ్‌ హెచ్చరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10