AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆకలి తీరుస్తూ.. ఆపన్న‘హస్తం’ అందిస్తూ.. పేదల పెన్నిధి కంది శ్రీనన్న

కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాసరెడ్డికి జనం జేజేలు

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, ఆదిలాబాద్‌)
అతను రాజకీయ నాయకుడే కాదు.. పేదల ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు.. అన్ని వేళలా నేనున్నానంటూ ఆపన్న‘హస్తం’ అందించే సేవాతత్పరుడు.. ఎవరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో రోజూ వందలాది మంది పేదలకు అన్నదానం చేస్తున్న యువనేత.. ఆకలి బాధ విలువ తెలిసోన్నళ్లకే ఇది సాధ్యం. అలాంటి మంచి ఆలోచన రావడమే కాదు.. నిత్యం అమలు చేస్తున్న ఆ నాయకుడే.. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి. ఆదిలాబాద్‌ గడ్డపై బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ రోజు వందలాది మంది ఆకలి తీరుస్తున్న గొప్ప మనసును చాటుకుంటున్నారు. అక్కడ భోజనం చేసిన వాళ్లంతా అన్నదాత సుఖీభవ అంటూ కంది శ్రీనివాస్‌రెడ్డిని దీవిస్తుండటం ఆయన ఆత్మీయతకు నిదర్శనం.


ఆకలి తీర్చే ప్రజాసేవాభవన్‌…
అన్నదానాన్ని మించిన దానం లేదంటారు. సమాజంలో ధనవంతులు చాలా మందే ఉండొచ్చు. కాని దానగుణం ఉన్న దయార్ద హృదయులు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి కోవలేకే వస్తారు మంచి మనసు ఉన్న నేత కంది శ్రీనివాస్‌ రెడ్డి. ప్రతీ రోజు వందలాది మంది ఆకలి తీరుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకే కందిశ్రీనివాస్‌ రెడ్డి ప్రజాసేవాభవన్‌ ఏర్పాటు చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వాటినీ పరిష్కరించడం తో పాటు ప్రజాసేవా భవన్‌ లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచి ఆదిలాబాద్‌కు వచ్చిన తర్వాత పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నదే తడువుగా రెండేళ్ల క్రితం ప్రజాసేవా భవన్‌లో మధ్యాహ్న భోజనం మొదలైంది. ప్రతీ రోజు ఒంటి గంట అయిందంటే ప్రజాసేవా భవన్‌ జనంతో కిటకిటలాడుతుంది. ఆదిలాబాద్‌కు చెందిన జనం ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆకలి తీర్చుకుంటారు.

రోజూ వందల మంది రాక…
ప్రజా సేవా భవన్‌ ఆదిలాబాద్‌ రిమ్స్‌ వెనుక ఉండటంతో ఆసుపత్రికి వచ్చే నిరుపేదలు ఎంతో మంది కడుపు నింపుకోవడానికి ప్రజాసేవాభవన్‌ కు వస్తుంటారు. ఇక రోజు వారి కూలీలు చిరువ్యాపారులు, ఆటో, ట్రాక్టర్‌ డ్రైవర్లు పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే నిరుద్యోగులతో పాటు ప్రజాసేవాభవన్‌ కు వచ్చే జనం కాంగ్రెస్‌ శ్రేణులు ఇలా ఎంతో మందికి కందిశ్రీనివాస్‌ రెడ్డి స్థాపించిన ప్రజాసేవా భవన్‌ అన్నం పెట్టే అన్నపూర్ణ భవన్‌ గా పేరుతెచ్చుకుంది.

ఎంత మంది వచ్చినా..
శ్రీనన్న తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం పూట ఎంత మంది వచ్చినా అన్నం పెడుతారు. ఇంతమందికి అన్నం పెడుతారన్న లిమిట్‌ ఏమీ ఇక్కడ ఉండదు. ఆకలితో ఎవరు వచ్చినా అందరికి ఇక్కడ అన్నం దొరుకుతుంది. అలా మధ్యాహ్నం పూట భోజనం తిన్నవారంతా కంది శ్రీనివాస్‌ రెడ్డి పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. ఇంత మంది ఆకలి తీరుస్తున్న దయాగుణం నాయకుడు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.


నాణ్యమైన భోజనం…
కందిశ్రీనివాస్‌ రెడ్డి ఆలోచన ఒక్కటే.. పది మంది తినే అన్నం బాగుండాలి. తనకు కావాల్సిందల్లా అందరి దీవెనలు. ఖర్చుకు వెనుకాడకుండా అందుకే మధ్యాహ్న భోజనాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. అందుకే ఇక్కడ అన్నం తిన్నవారు హోటల్‌ భోజనం కన్నా ఇదే బాగుందని కంది శ్రీనివాస్‌ రెడ్డిని మెచ్చుకుంటున్నారు.

అన్నదానం కేరాఫ్‌ ప్రజాసేవా భవన్‌…
ఆదిలాబాద్‌ ప్రజాసేవా భవన్‌ గురించి అందరికీ తెలుసు. కంది శ్రీనివాస్‌ రెడ్డి మధ్యాహ్నం పూట భోజనాన్ని ఏర్పాటు చేశారన్న వార్తతో జనంలో ఆయన పాపులారిటీ మరింతపెంచింది. ఓవైపు సమాజ సేవ, మరోవైపు అన్నదానం చేయడం దయాగుణం ఉన్న మహానుబావులకే సాధ్యం. అందుకే కంది శ్రీనివాస్‌ రెడ్డి మహానుభావుడని అందరూ జేజేలు పలుకుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10