ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. దేవదాయ, వక్ఫ్, కోర్టు పరిధి, ప్రభుత్వ భూములు తప్ప ఇతర లేఅవుట్‌లు క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 20 లక్షల మంది లబ్ధి చేకూరుతుంది. 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుపై మార్చి 31 లోపు మొత్తం రుసుము చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ అవకాశం దక్కింది. ఇందులో భాగంగా వివాదాలు ఉన్న భూములు తప్ప, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు, దేవదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు మినహా ఇతర లేఔట్లకు అవకాశం కల్పించింది.
