వర్చువల్ ద్వారానే.. రెండు పథకాల ప్రారంభం
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. మరో రెండు ‘గ్యారంటీ’ పథకాలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ రద్దు అయినట్లు స్టేట్ కాంగ్రెస్ నాయకులు వెల్లడిరచారు. కాగా, టీ కాంగ్రెస్ చేవెళ్లలో రేపు (మంగళవారం) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అయితే ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ హాజరవుతారని టీపీసీసీ తెలిపింది. ఈ మేరకు సభకు ఏర్పాట్లు సైతం పూర్తి అయ్యాయి. ఈ సభలోనే ఆరు గ్యారంటీల్లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేత ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ రద్దు అయ్యింది. దీంతో రెండు పథకాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. చేవేళ్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
