AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తగ్గేదేలే.. ఖమ్మం నుంచి పోటీచేసి తీరుతా

నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు?
వీహెచ్‌ హాట్‌ కామెంట్స్‌

ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని తెలిపారు. అక్కడ ప్రజలపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశానని అన్నారు.

ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్‌ తనను అడుగుతున్నారని వీహెచ్‌ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. తానేం తప్పు చేశానని నిలదీశారు. తనను ఎందుకు పక్కన పెట్టారని అడిగారు.

కొత్తగా వచ్చిన వారు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని వీహెచ్‌ నిలదీశారు. గతంలో కూడా తనకు అన్యాయం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ప్రభుత్వం తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సముద్రంలోపలికి వెళ్లి పూజలు చేయడానికి సమయం దొరుకుతుంది ఉంది కానీ, మణిపూర్‌ వెళ్లడానికి మాత్రం సమయం లేదా? అని వీహెచ్‌ అన్నారు. దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. తమ పార్టీ నేత రాహుల్‌ గాంధీని గుడికి రానివ్వడం లేదని అన్నారు. గుడులు ఏమన్నా బీజేపీ వాళ్లవా అని నిలదీశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10