ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియల వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోద్ పూర్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ రిసెప్షన్ కు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అత్యంత ఘనంగా శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సినీ, క్రీడారంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఇక తాజాగా వైయస్ షర్మిల రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసిన షర్మిల ఆ వీడియోలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగిన తీరును, ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం తలంబ్రాల దృశ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. అయితే ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి మళ్ళీ హిందూ పద్ధతిలో తలంబ్రాలు పోయడం దేనికి అన్న ప్రశ్న చాలామంది నెటిజన్ల నుండి ఉత్పన్నమవుతుంది.









