AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముగిసిన రెండో రోజు ఆట.. ఆధిక్యంతో ఎవరంటే!

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 ఆలౌట్ అయ్యింది. జో రూట్ (122), ఆలీ రాబిన్సన్ (58) చేయడంతో ఇంగ్లాండ్ 353 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా నేడు ఆట చివరికి 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే షాక్ తగిలింది.

టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 2 పరుగులకు వికెట్ కోల్పోయాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైస్వాల్ తప్ప మిగతా ప్లేయర్లు ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (38), మన్ ధ్రువ్ జురెల్ (30) పరుగులు చేశారు. మిగిత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్ (17), ధ్రువ్ జురెల్ (30) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని టీమిండియాను దెబ్బతీశారు. ఇంగ్లాండ్ బౌలర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ లే 2 వికెట్లు పడగొట్టారు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 1 వికెట్ దక్కింది.

ANN TOP 10