ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ మధుసూదన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్షకు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ ని రద్దు చేసి సమావేశానికి రావాలని ధరణి కమిటీ పిలుపునిచ్చింది.
ప్రభుత్వానికి కమిటీ నివేదిక!
ధరణిలో సమస్యలపై కమిటీ సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. పోర్టల్ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు. ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వాటిని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనే అంశాలు సేకరించింది. ధరణి రిజిస్ట్రేషన్లల్లో భారీగా లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ధరణిలో ఉన్న సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు తీసుకుంటే బాగుంటుందనే ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ధరణి కమిటీ నిర్వహించిన దానిపై ఇప్పటివరకు ఉన్న అప్డేట్తో కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ధరణిలో చేయాల్సిన మార్పులపై లిస్టు తయారు చేసింది. ధరణి చట్టం న్యూ రెవెన్యూ యాక్ట్ 2020లో మార్పుకు ధరణి కమిటీ సూచనలు ఇవ్వనుంది. న్యూ రెవెన్యూ యాక్ట్ 2020లో సుమారు 8 నుంచి 10 మార్పులకు కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది.
కీలక ప్రతిపాదనలు తయారు
ధరణిలో చేయాల్సిన మార్పులపై లిస్టును కమిటీ తయారు చేసింది. ధరణి చట్టం న్యూ రెవెన్యూ యాక్ట్ 2020లో మార్పులకు ధరణి కమిటీ సూచనలు ఇవ్వనుంది. ఈ సమీక్షలో భాగంగా కమిటీ పాయింట్ ప్రెసెంటేషన్లో భూసమస్యల దరఖాస్తులు ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్ లైన్లో కూడా తీసుకునే సూచన చేయనుంది. పెండింగ్ ఉన్న ఏడు లక్షల సాదా బైనామా పేదల దరఖాస్తుల 5ఏ చట్టంలో మార్పులపై వివరణ ఇవ్వనుంది. ధరణి చట్టంలో సుమారు ఎనిమిది నుంచి పది అంశాలతో మార్పులను సూచించబోతున్నది. చట్టంలో మార్పులకు బదులు కొత్త చట్టం రూపకల్పనపై కమిటీ సూచనలు ఇవ్వనుంది. ధరణి నిర్వహణ ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ ఆధీనంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌కి అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఇవ్వాలని, దేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వ వెబ్సైట్లు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నడుపుతున్నట్లు అభిప్రాయపడింది. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టు కాకుండా గ్రామ స్థాయి న్యాయ స్థానాలు ఏర్పాటు, రెవిన్యూ కోర్టుల పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయం తెలిపింది. ప్రతి రెండు నెలలకోసారి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని, సమగ్ర భూ సర్వే చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.