AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనసేన తొలి జాబితా విడుదల.. ఐదుగురు అభ్యర్థులు వీరే..

అమరావతి: ఏపీని‌ అభివృద్ధి పథంలో నడిపించాలని.. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ (TDP), జనసేన (Janasena) కలిశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కన్నారు. పొత్తుకు బీజేపీ (BJP) ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ (YCP) విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ ఐదుగురితో కూడిన లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే బీజేపీ (BJP) కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో.. టీడీపీ ఓటు మనకు పడటం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు.

ఎక్కువ సీట్లు తీసుకుని ఏదో చేయాలని తనకు లేదని పవన్ అన్నారు. 98 శాతం అవకాశాల కోసం తాను‌ 24.. ఎమ్మెల్యే 3 పార్లమెంటు స్థానాలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం నష్టపోయిందని.. అందుకే కొన్ని త్యాగాలకు సిద్ధమైనట్టు తెలిపారు. బీజేపీ కోసం‌ కూడా కొన్ని సీట్లు కుదించుకున్నామన్నారు. 79 సీట్లు తీసుకుని ఏదో పోటీ‌ ప్రయోజనం ఉండదన్నారు. గతంలో తనకు పది సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదన్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన, టీడీపీ ఓట్లు కరెక్ట్‌గా ట్రాన్సఫర్ అవ్వాలన్నారు. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని, గెలుస్తున్నామని వెల్లడించారు.జగన్ సిద్ధం.. సిద్ధమని చావ గొడుతున్నాడని… తాము తప్పకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తామన్నారు. ఈ రాక్షస రాజ్యాన్ని తరమికొట్టి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయడమే తమ కలయిక లక్ష్యమని పవన్ అన్నారు.

జనసేన అభ్యర్థులెవరంటే..

తెనాలి – నాదెండ్ల మనోహర్

నెల్లిమర్ల – లోకం మాధవి

అనకాపల్లి – కొణతాల రామకృష్ణ

రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ

కాకినాడ రూరల్ – పంతం నానాజీ

ANN TOP 10