12 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు….
భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతోంది. మహాజాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు అత్యధిక సంఖ్యలో తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి.
ఫలితంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనాల రాకపోకలు స్తంభించి తాడ్వాయి నుంచి మేడారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 12 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.గంటల తరబడి ఎక్కడి వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.