AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తొలిరోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే!

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. జార్ఖండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాట్ పట్టి మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు మొదట్లోనే విజృంభించారు. టీమిండియా బౌలర్ల ధాటికి 47 పరుగుల వద్దనే వికెట్ల పతనం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (42) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (11) పరుగులకే పెవిలియన్ చేరగా.. ఒల్లీ పోప్ (0) డకౌట్‌కు పరిమితం అయ్యాడు. ఈ ముగ్గురిని టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ ఔట్ అయ్యాడు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్ ఔట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ ఆ సమయంలో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత జో రూట్ ఆటపై పట్టు బిగించాడు.

జో రూట్, జానీ బెయిర్‌స్టో ఇద్దరు మంచి భాగస్వామ్యం నెలకోల్పారు. ప్రత్యర్థి టీమిండియా బౌలర్లను జో రూట్ చెడుగుడు అడుకున్నాడు. 229 బంతుల్లో 9 ఫోర్లతో (106) పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అటు జానీ బెయిర్‌స్టో (34) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బెన్ ఫోక్స్ (47), టామ్ హార్ట్లీ (13) రన్స్ చేశారు. ప్రస్తుతం క్రీజులో ఆలీ రాబిన్సన్ (31), జో రూట్ (106) పరుగులతో ఉన్నారు. ఇందులో టీమిండియా బౌలర్లు ఆకాష్ దీప్ 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లతో సత్తాచాటారు. అటు జడేజా, అశ్విన్ 1 తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ ( సీ), బెన్ ఫోక్స్ (డబ్ల్యూకే), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

టీమిండియా జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సీ), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (డబ్ల్యూకే), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

ANN TOP 10