AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. సీఎం రేవంత్

హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న (Sayanna)తో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మిక మరణం పాలవడం అత్యంత విషాదకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లాస్య నందిత ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రేవంత్ తెలిపారు.

ANN TOP 10