తెలంగాణ కుంభమేళా మహా జాతర మేడారానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై రానున్నారు. శుక్రవారం ఉదయం 11 లకు గవర్నర్ తమిళిసై ములుగు జిల్లాకు చేరుకుంటారు. మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతరకు గవర్నర్ వరుసగా రెండు సార్లు హాజరయ్యారు. రేపు మరోసారి వనదేవతను దర్శించుకోనున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేడారం వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఇతర మంత్రులు హాజరవుతున్నారు. కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి అర్జున్ ముండా మేడారం మహా జాతరకు వస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. గవర్నర్, సీఎం రాకతో అధికారులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
