AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మేడారం జాతీయ పండుడగా గుర్తించే పద్ధతి లేదు’

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా గురువారం సమ్మక్క, సారలమ్మను కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అలాగే నవ దేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరిపై సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు ఉండాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరపున తాను మొక్కులు చెల్లించాలని తెలిపారు. జాతీయ పండుగగా గుర్తించే సిస్టమ్ దేశంలో మరే చోట లేదని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి వివరించారు. జాతర కోసం రూ.3.14 కోట్ల నిధులు అందజేశామని వివరించారు. సమ్మక్క సారమ్మ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గిరిజన వర్సిటీలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని.. అలాగే తరగతులు ప్రారంభం అవుతాయని కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

ANN TOP 10