AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సచివాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు.. షాక్‌లో అధికారులు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అటు పాలనపై ఇటు 6 గ్యారంటీల అమలకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పని చేస్తున్నారు. అంతేకాకుండా మంత్రులు సైతం వారి వారి శాఖలపై ఫోకస్ చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం సవివాలయంలోకి వస్తూ వస్తూనే తనిఖీలు చేయడంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాలను పరిశీలించారు. అధికారులు నిర్వహిస్తున్న పనులపై మంత్రి పొంగులేటి ఆరా తీశారు. అధికారులతో కాసేపు ముచ్చటించి పలు సూచనలు ఇచ్చిమంత్రి వెళ్ళిపోయారు.

ANN TOP 10