ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. షణ్ముఖ్ అతని సోదరుడు కూడా కేసులో బుక్కయ్యారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్‌కు వెళ్లారు. అదే సమయంలో గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు. ఆరు రోజుల్లో తనతో పెళ్లి ఉండగా మరో యువతిని వివాహం చేసుకున్నాడని యువతి అవేదన వ్యక్తం చేసింది. దీంతో మౌనిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడి ప్రశ్నించేందుకు ఫ్లాట్‌కు వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ దొరికిపోయాడు.
మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ వాదన చేశాడు. డ్రగ్ కేసులో షణ్ముఖ్, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో కూడా షణ్ముఖ్.. హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుంచి బయటపడగా.. తాజాగా మరో కేసులో చిక్కుకున్నాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి మౌనిక కీలక విషయాలను ప్రస్తావించింది. యూట్యూల్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ తనను షణ్ముఖ్ మోసం చేసినట్లు పేర్కొంది. షణ్ముఖ్ సోదరుడు తనపై లైంగిక దాడి చేశాడని, హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఒకసారి బలవంతంగా అబార్షన్ కూడా చేయించినట్లు యువతి మౌనిక ఫిర్యాదులో పేర్కొంది.