AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న ఇతర పార్టీ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రిని సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు.ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న ప్రజా సంకల్ప యాత్ర పేరుతో లోక్ సభ ఎన్నికలకు బీజేపీ శంఖారావాన్ని పూరించింది.

అయితే ఆదిలాబాద్ నియోజవకర్గ పరిదిలో జరుగుతున్న యాత్రకు రెండు రోజులుగా దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు గెలిచారు. అలాగే మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు కూడా కలిశారు. దీంతో వీరు పార్టీ మారుతున్నారా.. లేక వారి ప్రాంత అభివృద్ధి కోసమే సీఎంను కలిశారా అని ప్రశ్నార్థకంగా మారింది.

ANN TOP 10