AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గవర్నర్ అకౌంట్ హ్యాక్.. రంగంలోకి సైబర్ క్రైమ్

అమ్మన్యూస్, హైదరాబాద్: గవర్నర్‌ తమిళి సై ట్విట్టర్ (ఎక్స్‌) అకౌంట్ హ్యాక్‌ విచారణను సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ముంబై నుంచే గవర్నర్‌ ఎక్స్‌ అకౌంట్ హ్యాక్‌ అయినట్లు గుర్తించారు. ముంబయిలోని బొటెక్ వైఫె నెట్ వర్క్‌ ను దుండగులు వినియోగించి హ్యాక్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియడం లేదు. దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొన్ని రోజులుగా బోటిక్ షాప్ మూసివేసి ఉందని పోలీసుల విచారణలో తేలింది.

గవర్నర్ ఎక్స్ అకౌంట్ ఎందుకు హ్యాక్ చేశారు? పర్యటన వివరాలు తెలుసుకునేందుకు ఇలా చేశారా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 14న తెలంగాణ గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. ఈ క్రమంలో మూడు కొత్త ఐపీ చిరునామాలు గుర్తించారు. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారంటూ ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్ తమిళికి మెయిల్ వచ్చినట్లు సమాచారం. దీంతో గవర్నర్ తన ఖాతా తెరవడానికి ప్రయత్నించగా పాస్‌వర్డ్ తప్పు వస్తుందని అధికారులు వెల్లడించారు.

ANN TOP 10