AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జ‌గ జ్యోతి

మాస‌బ్‌ట్యాంక్‌లోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కే జ‌గ జ్యోతి ఏసీబీ ధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కార్యాల‌యంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. జ‌గ జ్యోతిని కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు.

ANN TOP 10