AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సిందే

జీఎస్టీ తర్వాత అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న ఎక్సైజ్‌ శాఖ చుట్టూ వివాదం రాజుకుంది. తాజాగా ఎక్సైజ్‌ డైరెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. ఎప్పటికప్పుడు లైసెన్స్‌ ఫీజు వాయిదాలను చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి దోహదపడుతున్న తమను అనవసర హెచ్చరికలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైన్‌ షాపుల ఓనర్లు మండిపడుతున్నారు. షాపుల లైసెన్సులకు సంబంధించి 9వ వాయిదా ఫీజు(ఎక్సైజ్‌ టాక్స్‌)ను ఈనెల 20లోపు చెల్లించాలని ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌అహ్మద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వాయిదా సొమ్ము వసూలు చేయాలని అన్ని జిల్లాల ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్ల(డీసీ)ను ఆదేశించారు. 20లోపు లైసెన్సు ఫీజు చెల్లించని వైన్‌ షాపుల (ఏ-4 షాపులు)ను మూసి వేయాలన్నారు. అలాంటి షాపుల నుంచి రూ.3 లక్షల పెనాల్టీనీ వసూలు చేయాలని ఆదేశించారు. గడువులోగా ఫీజు చెల్లించని షాపుల నుంచి 18 శాతం చొప్పున వసూలు చేసే పీనల్‌ ఇంట్రెస్ట్‌ (అపరాధ వడ్డీ)కు ఇది అదనమని తెలిపారు. ఏ షాపులు వాయిదా సొమ్ము చెల్లించలేదు, ఎంత పెనాల్టీని వసూలు చేశారన్న వివరాలను తమకు అందజేయాలని డీసీలను డైరెక్టర్‌ ఆదేశించారు.

ANN TOP 10