ఈ నెల 21న ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా ’మేడారం జాతర’ కు విచ్చేసే భక్తుల భద్రత, సౌకర్యార్థం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజుల పాటు బ్రహ్మండంగా జరగనున్న జాతరకు సర్వం సిద్ధమవుతోంది. జాతరకు హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా మేడారం వచ్చే భక్తులకు జాతర వివరాలు, ప్రయాణం, సూచనల వంటి సమాచారం అందించనున్నారు. ఇది భక్తులకు ఓ గైడ్‌గా పని చేస్తుంది. ఈ యాప్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని అందిస్తుంది.
*అర చేతిలో అంతా సమాచారం*
అదే విధంగా నాలుగు రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా ట్రాఫిక్ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు, వివిధ మార్గాల నుంచి మేడారం నుంచి వచ్చే వాహనాలకు వేర్వేరుగా ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు. భక్తులు ఏ రూట్లో వెళ్లాలి, అది ఎంత దూరం ఉందని తెలుసుకోవచ్చు. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజన్ సేవలు దీనిలో ఉంటాయి. అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాలు, తిరుగు ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి సమాచారం అందిస్తుంది. ఇంకా యాప్‌లో పార్కింగ్ సౌకర్యాలు, ఆర్టీసీ బస్సులు, రైలు మార్గాల గురించి వివరాలు ఉంటాయి. పార్కింగ్, ఆర్టీసీ పార్కింగ్, మళ్లింపు మార్గాలు అందులో తెలుసుకొవచ్చు. దర్శనం కోసం క్యూ లైన్లతో సహా జాతరలో చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ప్రదేశాల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. జాతర సమయంలో దారితప్పిన వారికి లేదా సహాయం అవసరమైన వారికి సహాయం అందించేందుకు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఏదైనా సంఘటనలు లేదా ఫిర్యాదులను పోలీసులకు నివేదించవచ్చు.
*నెట్‌వర్క్ లేకున్నా వాడుకొవచ్చు*
అయితే జాతర సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ లేదా మొబైల్ సిగ్నల్ పోయినప్పటికీ ముఖ్యంగా జాతరలోని ప్రధాన ప్రాంతాలలో యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఇది ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు, తరలింపు మార్గాలు, అత్యవసర సంప్రదించు నంబర్లు, సలహలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. పారదర్శకత సమయానుకూల నిర్ధారిస్తూ పోలీసులు ఈ యాప్ ద్వారా ప్రజలకు చురుకుగా సమాచారాన్ని అందిస్తుంది. హైదరాబాద్‌లోని వీమాక్స్ ఇ-సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘గైడ్ టూ మేడారం బై ముగులు పోలీసు’ అని సెర్చ్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.