మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ.. నా లైఫ్‌లైన్‌కి, నా విజయానికి కారణమైన సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా మెగాస్టార్ ఆకాంక్షించారు.
చిరంజీవి ప్రస్తుతం సురేఖతో కలిసి విదేశాల్లో ఉన్నారు. విశ్వంభర షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చిరంజీవి అర్ధాంగితో కలిసి యూఎస్ వెళ్లారు. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. హాలీడే కోసం యూఎస్ వెళ్తున్నామని, వచ్చాక తిరిగి విశ్వంభర సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెబుతూ సురేఖతో విమానంలో దిగిన సెల్ఫీని షేర్ చేశారు.